యాదాద్రీశుడికి ఘనంగా నిత్యపూజలు

ABN , First Publish Date - 2021-07-25T05:55:24+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులకు హారతి నివేదించారు.

యాదాద్రీశుడికి ఘనంగా నిత్యపూజలు
స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, జూల్‌ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులకు హారతి నివేదించారు. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి విశ్వక్సేనుడికి తొలిపూజలతో హోమం, నిత్యతిరుకల్యాణోత్సం నిర్వహించారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తర పూజలు కొనసాగాయి. సాయంత్రంవేళ వెండిజోడు సేవోత్సవాలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరస్వామికి, చరమూర్తులకు నిత్యవిధి కైంకర్యాలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. కొండకింద తులసీకాటేజ్‌లోని వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా స్వామికి శనివారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.6,54,911 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అఽధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2021-07-25T05:55:24+05:30 IST