‘నిషా'మాబాద్‌

ABN , First Publish Date - 2021-06-18T06:22:27+05:30 IST

జిల్లాలో నిషేధిత మత్తుపదార్ధాల విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, గుట్కా ప్యాకెట్లను నిత్యావసర సరుకుల మాదిరిగా పట్టణాలు, పల్లెల్లో విక్రయిస్తున్నారు. గుట్కా వ్యాపారానికి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర బిందువుగా తయారైంది. గంజాయిని గతంలో పట్ట ణాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయించేవారు.

‘నిషా'మాబాద్‌

జిల్లాలో జోరుగా మత్తుపదార్థాల విక్రయాలు

గంజాయికి బానిసలుగా విద్యార్థులు, యువకులు 

నిజామాబాద్‌ కేంద్రంగా గుట్కా వ్యాపారం

పోలీసుల విచారణలో తేలిన వైనం

ఇటీవలే బాల్కొండ సెగ్మెంట్‌లో పట్టుబడిన నిందితులు.. నిద్రమత్తులో అధికారులు

ఆర్మూర్‌, జూన్‌ 17: జిల్లాలో నిషేధిత మత్తుపదార్ధాల విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, గుట్కా ప్యాకెట్లను నిత్యావసర సరుకుల మాదిరిగా పట్టణాలు, పల్లెల్లో విక్రయిస్తున్నారు. గుట్కా వ్యాపారానికి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర బిందువుగా తయారైంది. గంజాయిని గతంలో పట్ట ణాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయించేవారు. ప్రస్తు తం విక్రయాలు గ్రామాలకు విస్తరించాయి. ఇటీవల పోలీ సులకు పట్టుబడిన తీరుచూస్తే గ్రామాలలోనే ఎక్కువగా వి క్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలు కావడం ఆం దోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గంజాయి సరి హద్దుకు సరఫరా చేస్తున్నారు. పొట్లాలు చేసి రెగ్యులర్‌ కస్ట మర్లకు అందజేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి విక్రయాలు జ రుగుతున్నప్పటికీ ఎక్సైజ్‌, పోలీసులు పట్టించుకోలేదు. గత సంవత్సరం కమ్మర్‌పల్లి వద్ద ఇద్దరు యువకులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పట్లోనే ఈ కేసును లోతుగా పరి శీలిస్తే పండించే వారు, సరఫరా చేసే వారు దొరికారు. కానీ, పోలీసులు ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు తరలించి చేతు లు దులుపుకొన్నారు. ఇటీవల బాల్కొండ సెగ్మెంట్‌లోని క మ్మర్‌పల్లి మండలంలో జరిగిన హత్య కేసు నేపథ్యంలో గం జాయి వినియోగం తెరపైకి వచ్చింది. దీంతో పోలీసులు దా డులు చేస్తుండడంతో పలువురు పట్టుబడుతున్నారు. వే ల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద 4 రోజుల క్రితం పోలీసులు తనిఖీలు నిర్వహించగా కిలోన్నర గంజాయి పట్టుబడింది. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రెండు బైక్‌లు సీజ్‌ చేశారు. బు ధవారం మోర్తాడ్‌ మండలం ధర్మోరా వద్ద కిలో 600గ్రాము ల గంజాయిని పట్టుకున్న పోలీసులు ఇరువురిని అరెస్టు చే శారు. ఇందులో గంజాయి సాగు చేసే వ్యక్తి కూడా ఉన్నా డు. ఆదిలాబాద్‌ జిల్లా భోథ్‌ ప్రాంతంలో పండించి ఇక్కడికి సరఫరా చేస్తున్నట్టు తెలింది. 

గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు

నిజామాబాద్‌ నగరంలో పాన్‌ డబ్బాలు, కాలనీలలోని చిన్న కిరాణా దుకాణాలలో గంజాయి విక్రయాలను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఇది వారికి హైదరా బాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్నట్టు తె లిసింది. ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలో ఎ క్కువగా విక్రయాలు జరుగుతున్నాయి.  

మత్తుకు బానిసలవుతున్న యువకులు

గంజాయి మత్తుకు ఎక్కువగా యువకులే బానిసలవుతు న్నారు. సిగరెట్‌లో పొగాకు స్థానంలో గంజాయిని నింపి.. దానిని పీల్చి మత్తులోకి వెళ్తున్నారు. గంజాయి మత్తులో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా రు. జిల్లాలో ఇటీవల జరిగిన ఒక హత్య గంజాయి మత్తులో నే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తుకు విద్యార్థులు, యువకులు బానిసలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. మోర్తాడ్‌ మండలం ధర్మోరా గ్రా మంలో పట్టుబడిన నిందితులు గంజాయి వినియోగించే వారి వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. అందులో ఎక్కువ గా విద్యార్థులు, యువకులే ఉండడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మారుమూల గ్రా మాల విద్యార్థులు, యువకులు కూడా మత్తుకు బానిసయ్యార ంటే జిల్లాలో గంజాయి వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 

ఎక్సైజ్‌ అధికారుల ఊదాసీనత

జిల్లాలో గంజాయి గుప్పుమంటున్నప్పటికీ ఎక్సైజ్‌ అధికా రులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోం ది. ఎక్సైజ్‌ అధికారులు గంజాయి విక్రయాలపై పెద్దగా దా డులు చేయడం లేదు. గంజాయి ఎక్సైజ్‌ శాఖ పరిధిలోకి వ స్తుందని, వారే దాడులు చేయాలని పోలీసులు అంటున్నా రు. ఈ నేపథ్యంలో రెండు శాఖల వారు సమన్వయంతో దా డులు చేసి గంజాయి విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

గుట్కా వ్యాపారానికి కేంద్రంగా నిజామాబాద్‌

గుట్కా అక్రమ వ్యాపారానికి నిజామాబాద్‌ కేంద్రంగా తయారైంది. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సర ఫరా అవుతోంది. గుట్కా వ్యాపారులు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి దందా కొనసాగిస్తున్నారు. నగర శివారులో గుట్కా గోదాంలు ఉన్నా యి. మహారాష్ట్రలోని నాందేడ్‌, కర్ణాటకలోని బీదర్‌ నుంచి ఇ క్కడికి గుట్కా సరఫరా అవుతోంది. నిజామాబాద్‌ ఈ రెం డు జిల్లాలకు సరిహద్దులో ఉండడం వల్ల సులభంగా జిల్లా కు తరలిస్తున్నారు. బుధవారం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు క ర్ణాటకలోని బీదర్‌ నుంచి మారుతి వ్యాన్‌లో జిల్లాకు తరలి స్తున్న సుమారు రూ.7లక్షల విలువైన గుట్కాను పట్టుకు న్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. మారుతి వ్యాన్‌ను సీజ్‌ చేశారు. ఇప్పటికైనా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు దాడు లు ముమ్మరం చేసి.. జిల్లాలో గంజాయి, గుట్కా విక్రయాల ను అరికట్టి యువత వాటికి బానిస కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-18T06:22:27+05:30 IST