ఆభరణాలను ప్లాస్టిక్ వస్తువుల్లో దాచండి.. ఫోన్లను ఫుల్ ఛార్జింగ్ చేసుకోండి : ముంబై వాసులకు సూచనలు

ABN , First Publish Date - 2020-06-03T20:30:38+05:30 IST

రాయగఢ్ వద్ద నిసర్గ తుపాను తీరం తాకడంతో ముంబై, గుజరాత్‌ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే

ఆభరణాలను ప్లాస్టిక్ వస్తువుల్లో దాచండి.. ఫోన్లను ఫుల్ ఛార్జింగ్ చేసుకోండి : ముంబై వాసులకు సూచనలు

ముంబై : రాయగఢ్ వద్ద నిసర్గ తుపాను తీరం తాకడంతో ముంబై, గుజరాత్‌ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పలు గ్రామాలను ఎన్డీఆర్‌ఏఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా ముంబై వాసులకు భారత వాతావరణ శాఖ బుధవారం కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. అవేంటంటే.... 

1. నిసర్గ కారణంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1916కు డయల్ చేయాలని ,లేదంటే 4 నెంబర్‌కు డయల్ చేయాలి.

2. ఇంట్లోనే ఉండండి. మొబైల్ ఫోన్లను ఫుల్‌గా చార్జింగ్ చేసుకోండి. పవర్ బ్యాంకులను కూడా ఫుల్ చార్జింగ్ చేయండి.

3. క్యాండిల్లు, టార్చి లైట్లు, ఎమర్జెన్సీ లైట్లను కూడా చార్జింగ్ చేసి జాగ్రత్త పడండి.

4. ఎలక్ట్రికల్ పరికరాలకు సరఫరా అయ్యే మెయిన్‌ భాగాన్ని, గ్యాస్ సప్లై అయ్యే భాగాన్ని స్విచ్చాఫ్ చేయండి.

5. ముఖ్యమైన పత్రాలను, ఆభరణాలను ప్లాస్టిక్‌లో భద్రపరుచుకోండి.

6. కిటికీలకు దూరంగా ఉండండి. గాలి పీడనం బయటికి వెళ్లడానికి, సరిగ్గా ఉండడానికి కొన్ని కిటికీలను మాత్రం తెరిచి ఉంచండి. మిగితా వాసిని మూసేయండి.

7. అంతగా అవసరం లేని ఎలక్ట్రికల్ వస్తువులకు విద్యుత్ సరఫరా నిలిపేయండి. 

8. గ్యాస్ లీక్ వాసన వస్తుంటే... వెంటనే కిటికీలను తెరచి... ఇంటి నుంచి బయటికి వచ్చేయండి. వీలైతే.. గ్యాస్ వాల్వ్‌ను ఆపేసి... వెంటనే గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వండి. 


రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ముంబైలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులోకి తీసుకువచ్చారు. ముంబైలో రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు పుణెలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 


Updated Date - 2020-06-03T20:30:38+05:30 IST