Karnataka: నిపా వైరస్ ప్రబలకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-09-13T16:12:48+05:30 IST

పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి కర్ణాటకలోకి నిపా వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది...

Karnataka: నిపా వైరస్ ప్రబలకుండా చర్యలు

కేరళ నుంచి వచ్చే వారిపై నిఘా

బెంగళూరు : పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి కర్ణాటకలోకి నిపా వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేరళ సరిహద్దు జిల్లాల్లో నిఘావేయాలని నిర్ణయించారు. కేరళ నుంచి కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చే ప్రజలపై నిఘా వేసి వారిని పర్యవేక్షించాలని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ కేవీ త్రిలోక్ చంద్ర ఆదేశించారు.కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన వారిలో జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్చ, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యచికిత్స అందించాలని ఆరోగ్యశాఖ వైద్యులకు సూచించింది.

Updated Date - 2021-09-13T16:12:48+05:30 IST