ముంబై : మహారాష్ట్రలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా ఆసుపత్రుల్లో 95 శాతం పడకలు ఖాళీగానే ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. కొవిడ్ రెండో వేవ్ తో పోలిస్తే మూడో వేవ్ లో ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య తక్కువగా ఉందని మంత్రి చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 4 నుంచి 5 శాతం మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివిటీ రేటు 23.5 శాతంగా ఉందని, అయితే రాయ్ ఘడ్, పూణే, నాసిక్, నాందేడ్ జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే అధిక కరోనా కేసులు నమోదైనాయని మంత్రి పేర్కొన్నారు.టీనేజర్లకు కొవిడ్ టీకా మొదటి డోసు వేశామని మంత్రి చెప్పారు. జనవరి చివరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో కోవిడ్ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య మహారాష్ట్రలో పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి