నిమ్మలపాడు కాల్సైట్‌ మైన్స్‌ లీజులు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:26:48+05:30 IST

మండలంలోని వాలాసీ పంచాయతీ నిమ్మలపాడులో కాల్సైట్‌ మైన్స్‌ లీజులు రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయా గ్రామస్థులు జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

నిమ్మలపాడు కాల్సైట్‌ మైన్స్‌ లీజులు రద్దు చేయాలి
ఆందోళన చేస్తున్న జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, నిమ్మలపాడు గిరిజనులు


జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు

అనంతగిరి, మే 23: మండలంలోని వాలాసీ పంచాయతీ నిమ్మలపాడులో కాల్సైట్‌ మైన్స్‌ లీజులు రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయా గ్రామస్థులు జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన మేఘనాథ్‌ రెడ్డి వ్యక్తి ఇక్కడకు వచ్చి బినామీల పేరిట కాల్సైట్‌ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని, పలు పర్యాయాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గంగరాజు ఆరోపించారు. 1/70, పెసా చట్టాలకు అతీతంగా తవ్వకాలు చేపడితే  తరిమికొడతామని హెచ్చరించారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా మైన్‌ ప్రారంభిస్తే ఉద్యమం తప్పదన్నారు. ఈ మేరకు హెచ్‌డీటీ లత్సాపాత్రుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నాగులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-24T05:26:48+05:30 IST