కేరళలో ఒమైక్రాన్ కేసుల కట్టడికి Night curfew

ABN , First Publish Date - 2021-12-28T12:45:45+05:30 IST

కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల కట్టడికి డిసెంబరు 30వతేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ కేరళ...

కేరళలో ఒమైక్రాన్ కేసుల కట్టడికి Night curfew

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల కట్టడికి డిసెంబరు 30వతేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు. కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 30 నుంచి జనవరి 2వతేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని కేరళ అధికారులు చెప్పారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా దుకాణాలను రాత్రి 10గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. జనం గుమిగూడేలా సమావేశాలను అనుమతించమని అధికారులు చెప్పారు.బార్ లు, హోటళ్లు, క్లబ్ లు, రెస్టారెంట్లను రాత్రి 10 గంటలవరకే 50 శాతం సీటింగుతో అనుమతిస్తామని చెప్పారు. బీచ్ లు, షాపింగ్ మాల్స్, పార్కుల్లో ఆంక్షలు అమలు చేయనున్నారు.కేరళలో 57 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో సోమవారం ఒక్కరోజే 1636 కొవిడ్ కేసులు వెలుగుచూడగా, 236 మంది మరణించారు.


Updated Date - 2021-12-28T12:45:45+05:30 IST