నిడదవోలులో కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-04-11T05:08:55+05:30 IST

నిడదవోలులో కొవిడ్‌ కేసులు పెరుగుతు న్నాయి. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ నోడల్‌ అధికారి నిర్లక్ష్యం వహిస్తున్న ఘటన నిడదవోలు పురపాలక సంఘ పరిధి లో జరిగింది.

నిడదవోలులో కొవిడ్‌ కేసులు

నిర్లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు

తూర్పు గొదావరి జిల్లాలో చికిత్స పొందుతున్న బాధితులు

నిడదవోలు, ఏప్రిల్‌ 10 :నిడదవోలులో కొవిడ్‌ కేసులు పెరుగుతు న్నాయి. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ నోడల్‌ అధికారి నిర్లక్ష్యం వహిస్తున్న ఘటన నిడదవోలు పురపాలక సంఘ పరిధి లో జరిగింది. పట్టణ పరిధిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడికి, యర్నగూడెం రోడ్‌లో ఓ కుటుంబంలో ఇద్దరికి, గాంధీనగర్‌లో మరో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో వారంతా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ ప్రైవేట్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పట్టణంలో కేసులు పెరుగుతున్న మున్సిపల్‌ అధికారులు, పారిశుధ్యం, హెల్త్‌ సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హెల్త్‌ అసిస్టెంట్‌ లక్ష్మణకుమార్‌ను వివరణ కోరగా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదని ఎప్పుడు అడిగిన కేసులు నమోదు కావడంలేదని తెలుపుతున్నారని చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి మాట్లాడుతూ తమ దృష్టికి ఇప్పటివరకు నోడల్‌ అధికారి నుంచి సమాచారం అందలేదని, తక్షణం తెలుసుకుని వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2021-04-11T05:08:55+05:30 IST