నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-09T06:26:04+05:30 IST

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి
బొమ్ములూరు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనదారుడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీఎస్సీ శ్రీనివాసులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, మే 8 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయం దాటిన తర్వాత రహదారులపై ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, 12 గంటలు దాటిన తరువాత ఎవరైనా రహదారులపై సంచరిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందని డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. బొమ్ములూరు  వద్ద జాతీయ రహదారిపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్ట్‌ను ఆయన శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేసి వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సరుకు రవాణా వాహనాలకు, మెడికల్‌ ఎమర్జెన్సీ, ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, సమయం దాటి వచ్చిన వాహనాలను వెనక్కు పంపించడంలో ఎలాంటి సందేహం లేదని, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని డీఎస్పీ తెలిపారు.  అనంతరం సీఐ డి.వి.రమణ, ఇంచార్జీ ఎస్సై పి. గౌతమ్‌ కుమార్‌లతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. కోడూరుపాడు చెక్‌పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్సై మదీనా బాషా ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-09T06:26:04+05:30 IST