వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం: నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2021-03-05T20:55:54+05:30 IST

ఉద్దీపనల లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌లో తాము ఆవిష్కరించగలిగామని అన్న నిర్మలా సీతారామన్.. కరోనా మహమ్మారి సమయాన్ని దీనికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు.

వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశంలోని యువత ప్రతిభను గ్రహించి మరింత పురోభివృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలను అమలు పర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనికి రానున్న 25 ఏళ్లు ఎంతో కీలకమని ఆమె అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ తాజా బడ్జెట్ ఈ విధానానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. దేశాన్ని తయారీ రంగంగా చూపిస్తూనే వ్యాపార రంగానికి ప్రోత్సాహాన్ని తోడ్పాటును బడ్జెట్ అందిస్తుందని నిర్మలా అన్నారు.


ఉద్దీపనల లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌లో తాము ఆవిష్కరించగలిగామని అన్న నిర్మలా సీతారామన్.. కరోనా మహమ్మారి సమయాన్ని దీనికి సమర్ధవంతంగా ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఏక కాలంలో సంస్కరణలు అమలు చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-03-05T20:55:54+05:30 IST