ఉమ్మడి జిల్లాలో 92 పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-02T10:36:33+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 92 పాజిటివ్‌

ఉమ్మడి జిల్లాలో 92 పాజిటివ్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 1 : ఉమ్మడి జిల్లాలో శనివారం 92 పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 48, సూర్యాపేటలో 34, యాదా ద్రి జిల్లాలో 10 కేసులు నిర్ధారణ అయ్యాయి.


బీహార్‌ నుంచి వలస వచ్చి భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి శివారులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా మునిసిపాలిటీలోని మార్కండేయనగర్‌ కాలనీ(పాతకోట)లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత నాయకుడికి పాజిటివ్‌ వచ్చింది.


మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు చడపంగు గురవయ్య కరోనాతో మృతిచెందారు. రఘునాథపాలెం గ్రామంలో ఒకరికి, బక్కమంతులగూడెం గ్రామంలో ఇద్దకి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఆగస్టు 14 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించేందుకు గ్రామస్థులు నిర్ణయించారు.


నడిగూడెం మండలంలోని రత్నవరంలో 60ఏళ్ల వృద్ధుడికి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే 104 ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. రత్నవరంలో ఇంటింటి సర్వే నిర్వహించి 24మందిని హోంకార్వంటైన్‌ చేశారు.


మద్దిరాల మండలంలోని చందుపట్ల గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


మర్రిగూడ మండలంలోని రాజుపేట పంచాయతీలోని పద్మశాలి కాలనీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.


 నాగార్జునసాగర్‌లో నిర్వహించిన రాపిడ్‌ పరీక్షల్లో హాలియా మునిసిపాలిటీలోని గోడుమడకబజార్‌లో ఒకరికి, అంగడి బజార్‌లో మరొకరికి, అనుముల మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఇంకొకరికి పాజిటివ్‌ వచ్చింది.


నేరేడుచర్ల పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి, చిల్లేపల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, నేరేడుచర్లలో ఈ నెల 14వరకు విధించిన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను తొలగిస్తున్నట్లు మునిసిపల్‌ చైర్మన్‌ జయబాబు, కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి తెలిపారు.


కరోనా పాజిటివ్‌తో చికిత్సపొంది కోలుకున్న నల్లగొండ ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌ శనివారం విధుల్లో చేరారు. ఆయనకు పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


సాగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 33 మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌గా వచ్చింది. ఇదిలా ఉండగా, పైలాన్‌ కాలనీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి కరోనాతో నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


సూర్యాపేట మునిసిపాలిటీ పరిధి పిల్లలమర్రిలోని కొత్తగూడెంబజార్‌లో 45 ఏళ్ల మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో వైద్యసిబ్బంది ఆరోగ్య సర్వే నిర్వహించారు.


రామన్నపేట పీహెచ్‌సీలో 14మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అందులో ఒకరు రామన్నపేట ఎస్‌ఐ.


యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధి, పాతగుండ్లపల్లి గ్రామానికి చెందిన మహిళకు పాజిటివ్‌ వచ్చింది.


కోదాడ పట్టణం మారుతినగర్‌లో రెండు, టీచర్స్‌కాలనీ, సాలార్జంగ్‌పేటలో ఒకటి చొప్పున రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


చిలుకూరు పీహెచ్‌సీలో 26 మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. 8 తిప్పర్తి మండల కేంద్రంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు సర్పంచ్‌ రమేష్‌ తెలిపారు.

Updated Date - 2020-08-02T10:36:33+05:30 IST