Abn logo
Aug 2 2020 @ 05:06AM

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

దేవరకొండ / చింతపల్లి / డిండి / కొండమల్లేపల్లి / చందంపేట, ఆగస్టు 1 : డిండి మండలం కందుకూరుతో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాల్లో రైతు వేదికలను ఇతర ప్రాంతాలకు మార్చడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు ముందస్తుగా బీజేపీ ముఖ్య నేతలను అరెస్ట్‌ చేసి దేవరకొండ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెజవాడ శేఖర్‌, కేతావత్‌ లాలూనాయక్‌ మాట్లాడుతూ  బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు మంజూరైన రైతు వేదికలను ఎమ్మెల్యే ఇతర ప్రాంతాలకు తరలించేలా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మంజూరైన గ్రామాల్లోనే రైతు వేదికలు నిర్మించాలన్నారు. అరెస్టైన వారిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ వెంకటే్‌షయాదవ్‌, వస్కుల సుధాకర్‌, జల్లా భాస్కర్‌, రవి, వెంకటేష్‌, రెడ్డి శంకర్‌, సహాదేవ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం అరె్‌స్టచేసిన బీజేపీ నేతలను వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. చింతపల్లి, డిండి మండలాల్లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. కొండమల్లేపల్లి, చందంపేట మండలాల్లో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కొండమల్లేపల్లి, చందంపేట మండల అధ్యక్షులు బొడిగె సాంబశివుడు, పాత్లావత్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement