Viral అవుతున్న నవవధువు నిర్వాకం.. చక్కగా భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. పక్కవాళ్లు ఇబ్బంది పడేలా..

ABN , First Publish Date - 2022-05-22T18:47:29+05:30 IST

నవవధువుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన పెళ్లికూతురు.. గుమ్మం వద్ద అందరికీ షాకిచ్చింది. ఆమె చేసిన పనికి పక్కవాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలు చూసి నెటి

Viral అవుతున్న నవవధువు నిర్వాకం.. చక్కగా భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. పక్కవాళ్లు ఇబ్బంది పడేలా..

ఇంటర్నెట్ డెస్క్: నవవధువుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన పెళ్లికూతురు.. గుమ్మం వద్ద అందరికీ షాకిచ్చింది. ఆమె చేసిన పనికి పక్కవాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ‘ఘనంగా పెళ్లి చేసుకున్నావ్. హ్యాపీగా భర్తతో కలసి అత్తారింట్లో అడుగు పెట్టకుండా.. ఈ పనులు ఏంటి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఏం చేసింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆగ్రాకు చెందిన యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో వారి పెళ్లికి కుటుంబ సభ్యులు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం ఆ నవవధువు.. భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లింది. నూతన వధూవరులు ఇంటి వద్దకు రాగానే వరుడి కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా మంగళహారతి ఇచ్చి.. లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో భర్తతో కలసి నవవధువు అక్కడున్న వారందరికీ షాకిచ్చింది. అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. భర్త‌తో సహాయంతో గాల్లోకి తుపాకీ పేల్చింది. భారీ శబ్దానికి పక్కన ఉన్నవాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 


Updated Date - 2022-05-22T18:47:29+05:30 IST