New Year వేడుకలు.. Virus.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

ABN , First Publish Date - 2022-01-04T12:00:36+05:30 IST

గతేడాది డిసెంబర్‌లో 2700కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో..

New Year వేడుకలు.. Virus.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌ సిటీ : గతేడాది డిసెంబర్‌లో 2700కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకలు, పలు ప్రాంతాల్లో రద్దీ నేపథ్యంలో కేసుల సంఖ్య మొదటి, రెండో వారాల్లో పెరిగే అవకాశముందని జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల ఆధారంగా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయనున్నాయి. శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు.


కేసు నమోదైన ప్రాంతంలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తితోపాటు.. చుట్టూ 20-25 ఇళ్లలో క్రమం తప్పకుండా సోడియం హైపో క్లోరైట్‌ ద్రావకం పిచికారి చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. అలాగే మాస్కులు ధరించని వారికి రూ. 1000 చలాను విధిస్తున్నారు. మీ సేవలో చెల్లించాలని సూచిస్తున్నట్లు చిక్కడపల్లి సీఐ ఎన్‌.సంజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఒక్కరోజే నగరంలో 294 మందికి పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2022-01-04T12:00:36+05:30 IST