HYD : ‘నయా’ జోష్‌.. వెల్లువెత్తిన ఉత్సాహం.. కార్లలో గానా బజానా..

ABN , First Publish Date - 2022-01-01T17:09:12+05:30 IST

హ్యాపీ న్యూ ఇయర్‌, నయాసాల్‌ ముబారక్‌.. అంటూ శుక్రవారం అర్ధరాత్రి యువత ...

HYD : ‘నయా’ జోష్‌.. వెల్లువెత్తిన ఉత్సాహం.. కార్లలో గానా బజానా..

  • 12 గంటల తర్వాత యువత రోడ్లపైకి..
  • అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సంబురాలు
  • రోడ్లపైనే పోలీసులు.. 
  • జోరుగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు


హైదరాబాద్‌ సిటీ : హ్యాపీ న్యూ ఇయర్‌, నయాసాల్‌ ముబారక్‌.. అంటూ శుక్రవారం అర్ధరాత్రి యువత రోడ్లపై షికారు కొట్టారు. కార్లలో గానా బజానా, హారన్ల మోతెక్కించారు. హోటళ్లు, పబ్‌లలో పెద్దగా ఈవెంట్ల జోరు లేకున్నా, యువత వీధుల్లో చక్కర్లు కొట్టారు.  సాయంత్రం 7 గంటల నుంచే సూపర్‌మార్కెట్లు, స్టోర్లు, వైన్‌షాపులు కిటకిటలాడాయి. చాలాచోట్ల రాత్రి 8కే 75 శాతానికి పైగా కేక్‌లను విక్రయించినట్లు బేకరీ యజమానులు తెలిపారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. మాంసం, స్వీట్లు, పండ్లు విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, బాచుపల్లి, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, నెక్లె్‌స్‌రోడ్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపుల్‌, చార్మినార్‌, నాంపల్లి, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ ప్రాంతాలు ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకున్నాయి.


కేక్‌ కట్‌ చేసిన సీపీలు

సీపీలు సీవీ ఆనంద్‌, మహేష్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర అర్ధరాత్రి  కేక్‌లు కట్‌ చేశారు. ఇతర పోలీసు అధికారులు పలు ప్రాంతాల్లో కేక్‌లు కట్‌ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు.


పార్టీ ఎట్‌ హోమ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాలంలో పార్టీ ఎట్‌ హోమ్‌ అన్నవారే ఎక్కువ. అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీ హౌస్‌లలోనే ఈసారి సందడి ఎక్కువగా కనిపించింది.  డిసెంబర్‌ 31వ రాత్రి ఏటా నగరంలో 200కు పైగా కార్యక్రమాలు, ఈవెంట్లు జరిగేవి. ఈసారి ఒకటి రెండు చోట్ల జరిగిన ఈవెంట్లలో మాత్రమే పార్టీప్రియులు ఎక్కువగా కనిపించారు.



Updated Date - 2022-01-01T17:09:12+05:30 IST