వివేకా హత్య కేసులో కొత్త ట్వీస్ట్..

ABN , First Publish Date - 2022-04-04T17:44:54+05:30 IST

ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు రోజుకొక ట్విస్ట్‌తో సాగుతోంది.

వివేకా హత్య కేసులో కొత్త ట్వీస్ట్..

కడప జిల్లా: ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు రోజుకొక ట్విస్ట్‌తో సాగుతోంది. సీబీఐ లోతైన దర్యాప్తుతో పెద్ద తలకాయల సంగతేంటో ప్రజలకు అర్థమైంది. అయితే కేసును వీలైనంత సాగదీసి అసలు నిందితులను అరెస్టు చేసినప్పుడు పెద్దగా సంచలనం కాకుండా చూసుకునేందుకు సూత్రధారులు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకే కోర్టు తలుపులు తట్టడాలు, విచారణాధికారులపైనే కేసులు పెట్టడం చేస్తున్నారని చెబుతున్నారు. తద్వారా వీలైనంతకాలం కేసును సాగదీయవచ్చునని, ఈలోగా ఏదోఒక మార్గం దొరక్కపోతుందా? అని కీలక నిందితులు ఆశపడుతున్నారని సమాచారం. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు గట్టిగానే మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో వారు ఏ మాత్రం జంకడంలేదు. సీబీఐ విచారణ తీరును విమర్శించడం, అప్రూవర్‌గా మారిన దస్తగిరి 164 స్టేట్‌మెంట్లు తప్పని చెప్పడం.. కీలక సూత్రధారిగా భావిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని వెనుకేసుకొస్తూ.. మీడియా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-04-04T17:44:54+05:30 IST