వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్లు!

ABN , First Publish Date - 2022-08-10T06:17:40+05:30 IST

తమ వినియోగదారులకు మరంత రక్షణతో పాటు యాప్‌పై వారికి పట్టుపెరిగేలా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్లను ప్రకటించింది. తాజా ఫీచర్ల ప్రకారం.. వినియోగదారుడు తాను ఉన్న

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్లు!

న్యూఢిల్లీ, ఆగస్టు 9: తమ వినియోగదారులకు మరంత రక్షణతో పాటు యాప్‌పై వారికి పట్టుపెరిగేలా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్లను ప్రకటించింది. తాజా ఫీచర్ల ప్రకారం.. వినియోగదారుడు తాను ఉన్న భాగస్వామ్యమైన వాట్సాప్‌ గ్రూప్‌నుంచి ఎవరికీ తెలియకుండా నిష్క్రమించవచ్చు. అదే విధంగా.. తాను ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరెవరు చూడొచ్చనేదాన్ని నియంత్రించవచ్చు. ఇక.. ఒకసారి మాత్రమే చూసేందుకు పంపించిన సందేశాలను(వ్యూ వన్స్‌ మెసేజ్‌లు) అవతలివారు స్ర్కీన్‌షాట్‌ తీయకుండా చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులకు తెలిసేందుకు ప్రచారం నిర్వహించనున్నట్లు వాట్సాప్‌ మాతృసంస్థ మెటా తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేసింది.

Updated Date - 2022-08-10T06:17:40+05:30 IST