పంద్రాగస్ట్‌ నుంచి కొత్త పింఛన్లు

ABN , First Publish Date - 2022-08-14T06:50:33+05:30 IST

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్‌లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధి కారులు ప్రొసిడింగ్‌లు ఇస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఈ పింఛన్‌లను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్‌ పింఛన్‌లన్నీ పూర్తయిన

పంద్రాగస్ట్‌ నుంచి కొత్త పింఛన్లు

జిల్లావ్యాప్తంగా పంపిణీకి ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్‌లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధి కారులు ప్రొసిడింగ్‌లు ఇస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం ఈ పింఛన్‌లను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్‌ పింఛన్‌లన్నీ పూర్తయిన తర్వాత, 57ఏళ్లు దాటిన వారందరి దరఖాస్తులను పరిశీలించి పింఛన్‌లను మంజూరు చేయనున్నా రు. వారికి కూడా ప్రస్తుతం పింఛన్‌లు పొందిన వారితో నెలనెలా అందించనున్నారు.

ఫ లబ్ధిదారులకు ఊరట

మూడేళ్లుగా కొత్త పింఛన్‌ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులను ఎంపిక చేసి, వారందరి కీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందజేయనున్నారు. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా అధి కారులు ప్రొసిడింగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని మండలాల పరిధిలో ఈ వేడుకల సందర్భంగా కొంతమందికి ఇవ్వడంతో పాటు మిగతా వారికి కొన్ని రోజుల్లో అందజేస్తారు. జిల్లాలో గత మూడేళ్లుగా దరఖాస్తుచేసిన వారిలో అర్హులైన వారు 16,938 మంది ఉన్నా రు. వీరి దరఖాస్తులు పరిశీలించి ప్రభుత్వానికి పంపి ఆ మోదం తెలిపారు. ఆ తర్వాత కూడా రెండేళ్లుగా వీరికి పింఛన్‌ ప్రభుత్వం మంజూరు చేయలేదు. నాలుగు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇవ్వ డంతో అర్హులకు ముందుగా ఇచ్చేందుకు ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రొసీడింగ్‌లను ఇవ్వడంతో పాటు ప్రతీ మండలంలో కొంతమందికి ఇచ్చేవిధంగా అధికారులతో సమావేశం జరుపుతూనే ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 39,162 మందికి పింఛన్‌లను అం దిస్తున్నారు. వికలాంగులకు రూ.3016, మిగతా వారికి రూ.2016 ఆసరా పింఛన్‌ల కింద అందజేస్తున్నారు. జిల్లాలో ప్రతీనెల రూ.50కోట్ల 3లక్షలను పింఛన్‌ల కోసం వెచ్చిస్తున్నారు. జిల్లాలో వృద్దాప్య పించన్‌లు 45253, వికలాంగ 16199, వితంతు 67476, చేనేత 190, కల్లుగీత 962, ఒంటరి మహిళలు 9721, బీడి కార్మికులు 95587 మందికి ఆసరా పింఛన్‌లు అందిస్తున్నారు. వీరితో పాటు వివిధ వ్యాదులతో బాధపడుతున్న వారికి 1774 మందికి ఈ పించన్‌లను అందజేస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటి వరకు పరిశీలించలేదు. 

ఫ 50వేల మంది దరఖాస్తు

జిల్లాలో 57 సంవత్సరాలు దాటిన వారందరినీ దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో సుమారు 50వేల మంది ఈ దరఖాస్తులను చేశారు. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ రాకపోవడం వల్ల ఇప్పటి వరకు వీటిని పరిశీలింలేదు. కొత్త పించన్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున త్వరలో గైడ్‌లైన్స్‌ వచ్చే అవకాశం ఉందని అధికారుల సమాచారం బట్టి తెలుస్తుంది. గైడ్‌లైన్స్‌ వచ్చిన తర్వాత ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మంజూ రు చేయనున్నారు. ప్రస్తుతం కొత్తగా ఆమోదం పొందిన వారికి అందించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి చందర్‌నాయక్‌ తెలిపా రు. దరఖాస్తులు చేసుకున్నవారికి మాత్రం పరిశీలన జరిపిన తర్వాత ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ప్రకారం మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-08-14T06:50:33+05:30 IST