భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు

ABN , First Publish Date - 2021-12-05T04:50:51+05:30 IST

కార్తీక మాసం ముగిం పు రోజు బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ప ట్టణంలోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు
గద్వాల నదిఅగ్రహారం రోడ్డులోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్న భక్తులు

గద్వాల టౌన్‌, డిసెంబరు 4 : కార్తీక మాసం ముగిం పు రోజు బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ప ట్టణంలోని ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్థానిక రాజయ్యతోట, వేదనగర్‌లో, అడవేశ్వర ఆలయంలో అ ర్చకుడు మర్లపల్లి నాగరాజు ఆంజయనే స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. రాతిబురుజు ఆం జనేయ స్వామి ఆలయం వద్ద భక్తులు ఆకుపూజలు ని ర్వహించారు. పిల్లిగుండ్ల కాలనీ అభయాంజనేయ ఆల యం, కోటలోని సోమనాద్రి నగర్‌ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కృష్ణానది రోడ్డులోని ఆంజనే యస్వామి ఆల యంలో భ క్తులు  స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయం వద్ద  వాహనాలకు పూజలు చేశారు. అనంతరం భ క్తులకు అన్నదానం నిర్వహించారు. 

  మల్దకల్‌ ఆలయంలో..

మల్దకల్‌ : మండల కేంద్రం లో వెలసిన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూ జా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదా న కార్యక్రమాలు జరిగాయి.  రాత్రి చిన్న రథోత్సవ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

మునిశంకర ఆలయంలో అన్నదానం

 గద్వాల రూరల్‌ : మండల పరిధిలోని అనంతపు రం గ్రామ గుట్టల్లో వెలిసిన ముని శంకర ఆలయంలో భక్తులు అమావాస్య పూ జలు ని ర్వహించా రు. కార్తీక మా సం చివరి రోజు కావడంతో భక్తు లు అధిక సంఖ్య లో తరలివచ్చారు. ఈ సందర్బంగా అక్క డ శివభక్తుడు ఎంపీవో చె న్నయ్య దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శివపురం లోని బ్రహ్మంగారి ఆలయంలో కూడా భక్తులు పూజలు చేసి అన్నదానం చేశారు.  

చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో..

ధరూరు : మండల పరిధిలోని చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంతోపాటు పలు దేవాలయాల్లో శని వారం అమావాస్యను పురస్కరించుకొని భక్తుల రద్దీ కనిపించింది. ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని క్యూ పద్ధతిలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

అయిజ పట్టణంలో..

అయిజ :  పట్టణంలోని ఆలయాల్లో శనివారం అమావాస్య పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేందస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నీలిమా హోటల్‌ యజమాని భక్తులకు అన్నదానం చేశారు.  అలాగే తిక్కవీరేశ్వరస్వామి ఆలయంలోనూ  ప్రత్యేక పూజలు నిర్వహించి  అన్నదానం చేశారు.  మండల పరిధిలోని సంకాపూర్‌ గ్రామ ప్రజలు భీమరాయుని ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.



Updated Date - 2021-12-05T04:50:51+05:30 IST