మేయర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-03-29T05:43:37+05:30 IST

మేయర్‌ బాధ్యతల స్వీకరణ

మేయర్‌ బాధ్యతల స్వీకరణ
మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న భాగ్యలక్ష్మి. చిత్రంలో మంత్రి వెలంపల్లి

చిట్టినగర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజుల క్రితం ఆమెను వైసీపీ కార్పొరేటర్లు మేయర్‌గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ముహూర్తం చూసుకుని ఆదివారం భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, వైసీపీ నగర కమిటీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌, కార్పొరేటర్లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడు ప్రతిపాదనలకు సంబంధించిన ఫైళ్లపై కమిషనర్‌ వై.ప్రసన్న వెంకటేష్‌ సంతకాలు చేయించారు. తాగునీటి సరఫరా, నగరంలో గ్రీనరీ బ్యూటిఫికేషన్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియామకాలకు సంబంధించిన ఫైళ్లపై భాగ్యలక్ష్మి సంతకాలు చేశారు. 

Updated Date - 2021-03-29T05:43:37+05:30 IST