కొత్తపాలసీపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-10-19T05:00:04+05:30 IST

కొత్తపాలసీపై ఉత్కంఠ

కొత్తపాలసీపై ఉత్కంఠ

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న మద్యం షాపులు

ఖమ్మంలో 33, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ ఖమ్మం కమాన్‌ బజార్‌, అక్టోబరు 18: ప్రస్తుత మద్యం షాపుల నిర్వహణ గడువు వచ్చేనెలతో ముగుస్తున్నా.. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించకపోవడంతో వ్యాపారుల్లో ఉత్కంఠ నెల కొంది. వాస్తవానికి గడువుకు ముందే మద్యం పాలసీ ప్రక టించి దరఖాస్తులు స్వీకరించడం, టెండర్లు నిర్వహించడం లాంటి తతంగాన్ని ఎక్సైజ్‌శాఖ పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకు సంబంధించి విధివిధానాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

ఖమ్మంలో 33.. భద్రాద్రిలో 12 కొత్త దుకాణాలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త మద్యంషాపుల ఏర్పాటు కు మాత్రం ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు పంపింది. ఖమ్మం జిల్లాలో 33, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 షాపులకు ప్రతిపాదనలు పంపారు. ఖమ్మంలో సత్తుపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 6, మధిర పరిధిలో 7, నేలకొండపల్లి పరిధిలో 5, సింగరేణిలో 3, వైరా 3, ఖమ్మం వన్‌టౌన్‌లో 4, టుటౌన్‌ (రూరల్‌)లో 5 కొత్త షాపులకు ఎక్సైజ్‌శాఖ ప్రతి పాదనలు పంపింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిఽధి లో 89, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78షాపులు న్నాయి. అదనంగా కొత్తషాపులు పెరగబోతు న్నాయి. అయితే ఎక్సైజ్‌శాఖ పంపిన ప్రతిపాదన లు ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతోపాటు ఈసారి మద్యం షాపుల్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీ గౌడకు 15శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పరిధిలో ప్రతీనెల రూ.120కోట్లు, భద్రాద్రి జిల్లాలో రూ.80కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. దీంతో ఇక మద్యం వ్యాపారంపై ఉమ్మడి జిల్లా వ్యాపారులే కాక పొరుగుజిల్లాలైన మహబూబాబాద్‌, వరంగల్‌, కరీనంగర్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాల వ్యాపారులు, ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా దవ్యాపారులు టెండర్లు దాఖలు చేసేఅవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా చాలామంది తమ బినామీల ద్వారా రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ మద్యం షాపులు దక్కించుకుని ఏపీకి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్నారు. దీంతో తెలంగాణ మద్యం వ్యాపారం పై ఏపీ మద్యం వ్యాపారులు కూడా ఇప్పటికే దృష్టి పెట్టారు. మద్యం పాలసీ ప్రకటిస్తే పెద్దఎత్తున ఏపీ వ్యాపారులు ఖమ్మంజిల్లా మద్యం షాపుల టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంది. 2019 మద్యం వేలంలో ఖమ్మం జిల్లా పరిధిలో 86షాపులకు 4,300దరఖాస్తులు రాగా రూ.86కోట్ల వరకు కేవలం దరఖాస్తుల మీదే ఆదాయం వచ్చింది. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలు చెల్లించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78షాపులకు 2500 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా రూ.50కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. 

వచ్చేనెలలో టెండర్లు...

సెప్టెంబరులో ముగియాల్సిన పాత టెండర్లను కరోనా నేపథ్యంలో నవంబరు 30వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో టెండర్లు ప్రారంభం కానుండంతో ఇప్పటి నుంచే వ్యాపారులు షాపులను దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది సిండికేట్‌గా మారి టెండర్లు వేయనున్నారు. అయితే ఈసారి మధ్యం పాలసి రెండు సంవత్సారాల, మూడు సంవత్సరాలా, ఫీజులు ఎలా ఉండనున్నాయో స్పష్టత రావడం లేదు. ఏపీలో మద్యం బ్రాండ్లు సక్రమంగా లేకపోవడంతో తెలంగాణ మద్యానికి డిమాండ్‌ పెరిగింది. దీంతో రాష్ట్ర సరిహద్దు లో దుకాణాలు కూడా పెరగ్గా.. మున్ముందు అక్కడి వ్యాపారుల హడావుడి మరింత పెరిగే అవ కాశం కనిపిస్తోంది. 

ఏజెన్సీలో నూరుశాతం రిజర్వే షన్‌ అమలయ్యేనా? 

జీవో నెంబరు 3 అనుసరించి ఇప్పటివరకు విద్యా, వైద్య తది తర ప్రభుత్వ శాఖలతో పాటు మద్యంషాపుల టెండర్లలో కూడా ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ మండ లాల్లో నూరుశాతం రిజర్వేషన్‌ను గిరిజనులకు అమలు చేస్తు న్నారు గతేడాది ఏప్రిల్‌లో సుప్రిం కోర్టు ఐదుగరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఉమ్మడి ఏపీలో జీవోనెం 3 ద్వారా నూరుశాతం రిజర్వేషన్‌ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు 50శాతం మించకూడదని, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జీవోనెంబరు 3 రాజ్యాంగ విరుద్ధమని, తేల్చింది. దీంతో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్‌ నిలిచిపోయింది. అయి తే ఇప్పుడు మద్యం షాపుల టెండర్ల విషయంలో జీవో నెంబరు 3ని అనుసరించి వందశాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వస్తున్న ఎక్సైజ్‌శాఖ ఈసారి టెండర్లలో ఈని బంధన అమలు చేస్తుందా లేదంటే నిలిపేస్తుందా అన్న చర్చ మద్యం వ్యాపారుల్లో జరుగుతోంది.

Updated Date - 2021-10-19T05:00:04+05:30 IST