అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్త కోర్సులు

ABN , First Publish Date - 2022-01-29T05:16:16+05:30 IST

అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్త కోర్సులు

అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్త కోర్సులు

ఎచ్చెర్ల: అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కొత్తగా ఆరు కోర్సులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్సీ కోర్సు, బీఎస్సీలో రెండు కోర్సులు, మూడు పీజీ డిప్లమో కోర్సులను ప్రారంభిస్తామన్నారు.  అరబిందో ఫార్మా పౌండేషన్‌ సౌజన్యంతో ఎంఎస్సీ విద్యార్థులకు క్వాలిటీ కంట్రోల్‌ అనలెటికల్‌ టెక్నిక్స్‌పై ఇంట ర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎన్‌ఏసీఎల్‌ సహకారంతో కెమికల్‌ టెక్నాలజీ కోర్సును వర్సిటీలో ప్రారంభిస్తామన్నారు. డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీలో డేటా సైన్స్‌, ఆర్టిఫిషయల్‌ ఇంటిలిజెన్స్‌ కోర్సులను ప్రారంభించనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-01-29T05:16:16+05:30 IST