కలెక్టర్ చాంబర్ కొత్తగా..
ABN , First Publish Date - 2022-06-10T06:24:51+05:30 IST
కలెక్టర్ చాంబర్ కొత్తగా..
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కలెక్టర్ చాంబరుకు నూతన సొబగులు సమకూరాయి. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లా ఏర్పడిన అనంతరం కలెక్టర్ చాంబరును ఆధునికీకరించారు. దీంతో ఇప్పటివరకు కలెక్టర్ డీఆర్వో చాంబరులో విధులు నిర్వహించారు. గురువారం నూతన చాంబరులోకి ప్రవేశించారు. ఇకపై ఆయన ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు.