ఆమెలాంటి రోగిని ఇప్పటి వరకు చూడలేదు: డాక్టర్ మోనిక

ABN , First Publish Date - 2021-05-15T23:38:29+05:30 IST

కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ముక్కుకు ఆక్సిజన్‌ పైపు, చేతికి సెలైన్‌తో సాధారణ బెడ్‌పై కూర్చుని ఎలాంటి ఆందోళన

ఆమెలాంటి రోగిని ఇప్పటి వరకు చూడలేదు: డాక్టర్ మోనిక

న్యూఢిల్లీ: కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ముక్కుకు ఆక్సిజన్‌ పైపు, చేతికి సెలైన్‌తో సాధారణ బెడ్‌పై కూర్చుని ఎలాంటి  ఆందోళన లేకుండా ‘లవ్ యూ జిందగీ’ పాటలు వింటున్న యువతి (30) వీడియో ఇటీవల సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అయింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె కరోనా చేతిలో ఓడిపోయారు. పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. విషయం తెలిసిన సోషల్ మీడియా కన్నీరు కార్చింది. ఓ ధీర వనితను కోల్పోయామంటూ ఆమెకు చికిత్స చేసిన ఢిల్లీ వైద్యురాలు డాక్టర్ మౌనిక ట్విట్ చేయడం ఎంతోమందిని విచారంలోకి నెట్టేసింది. 


తాజాగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ తన జీవితంలో తాను చూసిన అత్యంత ధైర్యవంతురాలైన రోగి ఆమేనని అన్నారు. ‘‘ఆమె చాలా ధైర్యవంతురాలు. నా కెరియర్‌లో ఇలాంటి మహిళను ఇప్పటి వరకు నేను చూడలేదు’’ అని పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించామని, అయినప్పటికీ లాభం లేకపోయిందని అన్నారు. ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని కొనియాడారు. పరిస్థితి ఏదైనా ధైర్యంగా ఉండాలన్న సందేశాన్ని పంపేందుకే ఆమె వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసినట్టు తెలిపారు. 


బాధిత యువతి కుటుంబం కూడా ఎంతో ఆశావహదృక్పథంతో ఉండేవారని, ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతి కోసం మెసేజ్‌లు పంపేవారని, ఆమె కోలుకుంటుందని, కరోనాను జయిస్తుందని చెప్పేవారని డాక్టర్ మోనిక చెప్పారు. ఓ వైద్యురాలిగా తాను ఎంతో మంది రోగులను చూశానని, కానీ ఆమె కుటుంబానికి తాను చాలా దగ్గరయ్యానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-15T23:38:29+05:30 IST