రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: WW-3 అంటూ నెటిజెన్ల ఆవేదన

ABN , First Publish Date - 2022-02-24T21:02:02+05:30 IST

ఈ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజెన్లు ఈ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధంతో పోలుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడ్డవారి ఫొటోలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: WW-3 అంటూ నెటిజెన్ల ఆవేదన

మాస్కో: ఉక్రెయిన్‌ దేశంపై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్‌.. మొత్తానికి ఉక్రెయిన్‌పై బలప్రయోగానికి దిగారు. అయితే ఈ యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజెన్లు ఈ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధంతో పోలుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడ్డవారి ఫొటోలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం వదిలిపోతున్న ఉక్రెయిన్ పౌరుల ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు.


కొంత మంది నెటిజెన్లు రష్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఆగడాలు తారాస్థాయికి చేరాయని, సోషలిజం వర్ధిల్లిన రష్యాలో దుర్మార్గపు పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరి కొందరు యుద్ధం కాదు, శాంతి కావాలంటూ కొందరు సూచిస్తున్నారు. అమెరికా జోక్యంపై కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. నాటో, యూరోపియన్ యూనియన్ ప్రమేయంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలను చూపిస్తూ యుద్ధం ఇలాంటి చేదు ఫలితాల్ని ఇస్తుందని దు:ఖాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై నెలిజెన్ల స్పందనలోని కొన్ని ట్వీట్లు

























Updated Date - 2022-02-24T21:02:02+05:30 IST