కొవిషీల్డ్ టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి

ABN , First Publish Date - 2021-03-07T23:57:57+05:30 IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి ఆదివారం కొవిషీల్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నేపాల్‌లో రెండో

కొవిషీల్డ్ టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి

కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి ఆదివారం కొవిషీల్డ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నేపాల్‌లో రెండో విడత వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ దశలో 65 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారు. భార్య రాధిక శాక్యతో కలిసి ఒలి ఈ ఉదయం త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ ఆసుపత్రిలో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. కొవిషీల్డ్ టీకాను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేయగా, పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.


టీకా తీసుకున్న అనంతరం ప్రధాని ఒలి మాట్లాడుతూ దేశంలో 65 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. టీకా పూర్తిగా సురక్షితమని పేర్కొన్నారు. కాగా, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, ఆరోగ్య మంత్రి హృదయేష్ త్రిపాఠీ, విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి కూడా నేడు కరోనా టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-03-07T23:57:57+05:30 IST