Nellore: స్వర్ణముఖి నదికి భారీగా నీటి ఉధృతి

ABN , First Publish Date - 2021-11-12T17:18:54+05:30 IST

జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నదికి నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. కోట నాయుడుపేటకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Nellore: స్వర్ణముఖి నదికి భారీగా నీటి ఉధృతి

నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి నదికి నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. కోట నాయుడుపేటకు  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోట మండలం గుడలి దగ్గర బ్రిడ్జిపై సుమారు 5 మీటర్ల పై ఎత్తున నీరు ప్రవహిస్తోంది. తొమ్మిది గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద శిధిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై సుమారు 6 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నదికి వరద నీరు ఎక్కువ కావడంతో అధికారులు స్వర్ణముఖి బ్యారేజి 11 గేట్లు ఎత్తి 15 వేల క్యూసికుల నీటిని దిగువకు విడుదల చేశారు. 


మరోవైపు జిల్లాలోని వెంకటగిరి రూరల్ మండలం, కొండ క్రింద ప్రాంతాల్లో వర్షాల కారణంగా వాగులు, వంకలు  పొంగిపొర్లుతున్నాయి. వెంకటగిరి - పాళెంకోట రహాదారిలో వరద ప్రవాహానికి గొడ్డేరువాగు కల్వర్టు  కొట్టుకుపోయింది. పాళెంకోట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. 

Updated Date - 2021-11-12T17:18:54+05:30 IST