నెల్లూరు పండితుడికి టీటీడీ అపూర్వ అవకాశం

ABN , First Publish Date - 2021-05-13T17:00:38+05:30 IST

నగరానికి చెందిన..

నెల్లూరు పండితుడికి టీటీడీ అపూర్వ అవకాశం

నెల్లూరు: నగరానికి చెందిన పండితుడు, శతావధాని డాక్టర్‌ సూరం శ్రీనివాసులుకు టీటీడీ నుంచి అపూర్వ అవకాశం లభించింది. నందకాంశ సంభూతుడు, తాళ్లపాక అన్నమాచార్యు డు రచించిన 933 కీర్తనలను తెలుగులోనికి అనువదించడం, వాటికి తాత్ప ర్యం, కఠిన తెలుగు పదాలకు సులభతరమైన పద పట్టిక తయారు చేసే బాధ్యతను శ్రీనివాసులుకు అప్పగించింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి నుంచి బుధవారం అధికారపు ఉత్తర్వులు అందాయి. శ్రీనివాసులుని వివిధ దేవతా స్వరూపాలతో అభిన్నంగా భావించి కీర్తించిన 11, 12, 13 సంపుటా లలోని మొత్తం 933 కీర్తనలను తెలుగులోనికి అనువదించి ప్రతి పదార్థం అర్థాలును అందించా లని, దానిని టీటీడీ ముద్రిస్తుందని, ఇందుకు శ్రీవారి ప్రసాదంగా సుమారు రూ.1 లక్ష పారి తోషికంగా అందిస్తామని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-13T17:00:38+05:30 IST