నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

ABN , First Publish Date - 2022-02-03T15:58:54+05:30 IST

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ని నిలిపి ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే గూడూరు రైల్వేస్టేషన్‌లో మారువేషాల్లో ఉన్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. బుచ్చి, వెంకటాచలం టోల్ గేట్లు వద్ద తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా అక్రమ అరెస్టులపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-02-03T15:58:54+05:30 IST