Abn logo
Jul 14 2021 @ 08:06AM

నెల్లూరు: ఇంకా లభించని మూడేళ్ల బాలుడి ఆచూకీ

నెల్లూరు: జిల్లాలోని ఉయ్యాలపల్లి సమీపంలో గల‌ వెలిగొండ అడవుల్లో అదృశ్యమయ్యాడని భావిస్తున్న మూడేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. గత పది రోజులుగా బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తూనే... విచారణ చేస్తున్నారు. సమీప గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బాలుడి కోసం  పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం నిర్వహించారు. త్వరలోనే కనిపెడుతామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఇన్ని రోజులైన తమ బిడ్డ ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.