Abn logo
Oct 23 2020 @ 09:54AM

నెల్లూరులో రౌడీషీటర్‌కు దేహశుద్ధి

నెల్లూరు: జిల్లాలోని సంగంలో తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై కన్నేసిన రౌడీషీటర్‌కు స్థానికులు తగిన గుణపాఠం చెప్పారు. సంగంలో తల్లితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న రౌడీషీటర్  ఆమె కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని రౌడీషీటర్‌కు దేహశుద్ధి చేశారు. ఆపై అతడిని పోలీసులకు అప్పగించారు. ఇరవై ఏళ్ల కిందట అత్యాచారం కేసులో రౌడీషీటర్ నిందితుడుగా తెలుస్తోంది. 

Advertisement
Advertisement