నెలటూరులో ట్రైనీ కలెక్టర్‌ సందర్శన

ABN , First Publish Date - 2021-02-25T04:45:55+05:30 IST

నెలటూరు గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌నపాయ్‌ బుధవారం సందర్శించారు.

నెలటూరులో ట్రైనీ కలెక్టర్‌ సందర్శన

చాగల్లు, ఫిబ్రవరి 24 : నెలటూరు గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌నపాయ్‌ బుధవారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌ షాపు, పంచాయతీ కార్యాలయం, నిర్మాణంలో ఉన్న సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. డ్వాక్రా మహిళలతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను గురించి తెలుసుకున్నారు. మహిళల పొదుపు చర్యలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:45:55+05:30 IST