కూలి చెల్లింపుపై చర్చలు సఫలం

ABN , First Publish Date - 2021-04-11T06:08:31+05:30 IST

బతుకమ్మ చీరల తయా రీకి సబంధించి కూలి చెల్లింపుపై వార్పిన్‌ కార్మికులు, యజమానులకు శనివారం జరిగిన చర్చలు సఫల మయ్యాయి.

కూలి చెల్లింపుపై చర్చలు సఫలం
ఒప్పంద పత్రాన్ని వార్పిన్‌ కార్మికులకు అందిస్తున్న యజమానులు

  సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 10 : బతుకమ్మ చీరల తయా రీకి సబంధించి  కూలి చెల్లింపుపై వార్పిన్‌ కార్మికులు, యజమానులకు శనివారం జరిగిన చర్చలు సఫల మయ్యాయి. యజమానులు ఒప్పుకోవడంతో వార్పిన్‌ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించారు. బతుకమ్మ చీరలకు గతేడాది చెల్లించిన కూలి ఈ ఏడాది చెల్లించడం కుదరదని యజమానులు చెప్పడంతో అదే కూలి ఇవ్వాలని సీఐటీయూ వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్వర్యంలో 20 రోజులుగా  నిరవధిక సమ్మె చేపడుతున్నారు.  శనివారం పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి, సమన్వయ కమిటీ ఆఽధ్వర్యంలో యజమానులు, వార్పిన్‌ కార్మికులు, కార్మికసంఘాల నాయకులతో కూలిపై చర్చలు జరిపారు.   2021లో తయారు చేసే బతుకమ్మ చీరల ప్లేన్‌  భీములు, జరీ భీములు లేదా బాబిన్‌తో సంయుక్తంగా 1250 మీటర్లకు రూ.625 కూలి ఇవ్వడానికి యజమానులు ముందుకు రావడంతో వార్పిన్‌ కార్మికులు ఒప్పుకున్నారు. గతేడాది ప్లేన్‌ భీములకు రూ.490 చెల్లించగా ప్రస్తుతం రూ.425, జరీ భీములకు గతంలో రూ. 250 ఇవ్వగా ప్రస్తుతం రూ.200 చొప్పున ఇవ్వనున్నారు.   సిరిసిల్ల పట్టణంతోపాటు చంద్రంపేట, తంగళ్లపల్లిలోని వార్పిన్‌లకు కూలి వర్తించనుంది. మర మగ్గాల క్లస్టర్‌ అభివృధ్ధి సమన్వయ కమిటీ సభ్యులు జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్‌, దూడం శంకర్‌, గోవిందు రవి, దూస భూమయ్య, అడెపు భాస్కర్‌, చిమ్మని ప్రకాష్‌, భీమని రామచంద్రం,  శంకర్‌, పోలు శంకర్‌, వార్పిన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఉడుత రవి, మూషం రమేష్‌, కోడం రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T06:08:31+05:30 IST