ఎన్‌ఓసీపై తాత్సారం

ABN , First Publish Date - 2022-06-30T06:01:10+05:30 IST

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఒక అడుగు ముందుకు పడితే...రెండు అడుగులు వెనక్కి పడుతోంది. ఇప్పటికీ భూసేకరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌కు కాలం ముగిసిపోయింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి నిబంధనలు పెడుతోంది. ఈ అడ్డంకులన్నీ తొలగించి, నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇద్దరూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కోరుతున్నారు. కానీ అక్కడ నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. ఇదిలావుంటే ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న జీఎంఆర్‌ గ్రూపు తొలి దశ నిర్మాణాలను చేపట్టడానికి ఆసక్తి కలిగిన నిర్మాణ సంస్థలు ముందుకు రావాలంటూ టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో రూ.2,300 కోట్లతో ఏడాదికి అరవై లక్షల మంది ప్రయాణికులకు సరిపడేలా అన్ని వసతులు సమకూర్చాలనేది ప్రణాళిక. ఈ పనులు పట్టాలు ఎక్కాలంటే...భూ సేకరణ ప్రక్రియ పూర్తికావాలి. ముందుగా అనుకున్న దాంట్లో 50 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం

ఎన్‌ఓసీపై తాత్సారం

భోగాపురం విమానాశ్రయంపై గందరగోళం

 కొలిక్కిరాని భూ సేకరణ వ్యవహారం

మరోవైపు సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌కు ముగిసిన కాల పరిమితి

50 కిలోమీటర్ల పరిధిలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు నిబంధనల అడ్డంకి

విశాఖ ఎయిర్‌పోర్టు ముసివేయాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం

అందుకు రాయల్టీ కోరుతున్న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా

అందుకు సుముఖంగా లేని సర్కారు

మరోవైపు మొదటి దశ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన జీఎంఆర్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఒక అడుగు ముందుకు పడితే...రెండు అడుగులు వెనక్కి పడుతోంది. ఇప్పటికీ భూసేకరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌కు కాలం ముగిసిపోయింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వడానికి నిబంధనలు పెడుతోంది. ఈ అడ్డంకులన్నీ తొలగించి, నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇద్దరూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కోరుతున్నారు. కానీ అక్కడ నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. ఇదిలావుంటే ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న జీఎంఆర్‌ గ్రూపు తొలి దశ నిర్మాణాలను చేపట్టడానికి ఆసక్తి కలిగిన నిర్మాణ సంస్థలు ముందుకు రావాలంటూ టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో రూ.2,300 కోట్లతో ఏడాదికి అరవై లక్షల మంది ప్రయాణికులకు సరిపడేలా అన్ని వసతులు సమకూర్చాలనేది ప్రణాళిక. ఈ పనులు పట్టాలు ఎక్కాలంటే...భూ సేకరణ ప్రక్రియ పూర్తికావాలి. ముందుగా అనుకున్న దాంట్లో 50 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. తమ భూములకు తక్కువ ధర నిర్ణయించారని, అది సరిపోదని పేర్కొంటూ ఒక ఉమ్మడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దాంతో సైట్‌ క్లియరెన్స్‌ ఆగింది.


విశాఖ విమానాశ్రయమే అడ్డంకా?

కేవలం 50 కి.మీ. దూరంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు వుండడానికి నిబంధనలు అంగీకరించవు. అందుకే విశాఖలో విమానాశ్రయాన్ని మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఏఏఐ అందుకు కొన్ని షరతులు పెట్టింది. విశాఖ విమానాశ్రయంలో అదనపు వసతుల కోసం ఇటీవలె రూ.60 కోట్లతో పనులు చేపట్టామని, ఆ మొత్తంతో పాటు ఇంతవరకు విమానాశ్రయానికి వెచ్చించిన మొత్తం అంతా తమకు ఇవ్వాలని కోరుతోంది. అది మాత్రమే కాకుండా ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం ద్వారా ఏడాదికి 20 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తున్నందున, వారి ద్వారా వచ్చే ఆదాయాన్ని, తమకు రాయల్టీ ద్వారా భర్తీ చేయాలని, ప్రతి ఏడాది ఈ మొత్తం ఇవ్వాలని అడుగుతోంది. అందుకు ఒప్పుకుంటే...ఎన్‌ఓసీ ఇస్తామని మెలిక పెట్టింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. ఎటువంటి షరతులు లేని ఎన్‌ఓసీ ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఏఏఐ అంగీకరించకపోవడంతో ఇటీవల మరోవైపు నుంచి ఒత్తిడి పెంచింది. విశాఖ విమానాశ్రయం నిర్మాణానికి వివిధ దశల్లో 74 ఎకరాల భూమి ఇచ్చామని, ఆ భూమిని వెనక్కి ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్‌ చేస్తోంది. దీనిపై విమానాశ్రయం డైరెక్టర్‌కు లేఖలపై లేఖలు రాస్తోంది. ఇలా భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణ వ్యవహారం డోలాయమానంలో పడింది. షరతులు లేని అనుమతులు ఇవ్వడానికి కేంద్రం సుముఖత చూపడం లేదు. 


Updated Date - 2022-06-30T06:01:10+05:30 IST