Abn logo
Sep 29 2021 @ 00:33AM

విద్యాకానుక కిట్లను పంపిణీలో నిర్లక్ష్యం

హెచ్‌ఎంను ప్రశ్నిస్తున్న డీఈవో విజయభాస్కర్‌

డీఈవో ఆగ్రహం


ఒంగోలువిద్య, సెప్టెంబ రు 28 : ఒంగోలు నగరం బండ్లమిట్టలో ప్రభుత్వ మో డల్‌ ప్రైమరీ స్కూలును మంగళవారం డీఈవో బి.వి జయభాస్కర్‌ ఆకస్మికం గా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణలో పలు లోపాల ను గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయకుండా స్కూలులో గుట్టలుగా పోసీ ఉండడాన్ని చూసి హెచ్‌ఎంపై డీఈవో మండిపడ్డారు. పాఠశాలకు 209 మంది విద్యార్థులు హాజరవుతుండగా 321 వి ద్యాకానుక కిట్లను హెచ్‌ఎం తీసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయకపోవడం అసహనం వ్యక్తం చేశారు. హె చ్‌ఎం విధులకు ఆలస్యంగా హాజరు కావడాన్ని తప్పుపట్టారు. దీంతో హెచ్‌ఎంకు సంజాయిషీ నోటీసు జారీ చేసినట్లు డీఈవో వెల్లడించారు.