ఏడాదికి రెండుసార్లు నీట్‌ !

ABN , First Publish Date - 2021-01-24T08:18:10+05:30 IST

జేఈఈ తరహాలోనే నీట్‌ పరీక్షను కూడా ఏడాదికి ఒకటి కన్నా ఎక్కువసార్లు నిర్వహించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సహా కేంద్ర విద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు సోమవారం జరిపే సమావేశంలో...

ఏడాదికి రెండుసార్లు నీట్‌ !

  • రేపటి భేటీలో తుది నిర్ణయం?


న్యూఢిల్లీ/చెన్నై, జనవరి 23: జేఈఈ తరహాలోనే నీట్‌ పరీక్షను కూడా ఏడాదికి ఒకటి కన్నా ఎక్కువసార్లు నిర్వహించాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సహా కేంద్ర విద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు సోమవారం జరిపే సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జేఈఈ(మెయిన్‌) కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఈ ఏడాది నుంచి నాలుగు దఫాలు నిర్వహించనున్నారు. అలాగే నీట్‌-యూజీ పరీక్షను కూడా ఒకటి కన్నా ఎక్కువసార్లు నిర్వహిస్తే వైద్య విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందేమో అన్న అంశంతో పాటు విధివిధానాల ఖరారుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కాగా, సోమవారం భేటీలో రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీట్‌ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా మార్పు చేయడంపైనా ఈ సమావేశంలో చర్చిస్తారని పేర్కొన్నాయి. 


Updated Date - 2021-01-24T08:18:10+05:30 IST