భారత్‌కు స్వర్ణం అందించిన ఈ నీరజ్ చోప్రా ఎవరు?

ABN , First Publish Date - 2021-08-07T23:20:50+05:30 IST

చండీగఢ్: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్.

భారత్‌కు స్వర్ణం అందించిన ఈ నీరజ్ చోప్రా ఎవరు?

చండీగఢ్: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం అందించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. హర్యానా, పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామంలో 1997 డిసెంబర్ 24న పుట్టాడు. చండీగఢ్ డీఏవీ కాలేజీలో చదివాడు. ప్రస్తుతం ఆర్మీలో నాయబ్ సుబేదార్ ర్యాంక్‌లో ఉన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌, కామన్వెల్త్ గేమ్స్‌లో  స్వర్ణం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించాడు. 


Tokyo Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. భారత్‌కు తొలి స్వర్ణం  

Updated Date - 2021-08-07T23:20:50+05:30 IST