ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలి

ABN , First Publish Date - 2021-02-27T05:30:00+05:30 IST

ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని కలె క్టర్‌ నివాస్‌ పారిశుధ్య కార్మి కులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వ హించిన అవగాహన కార్యక్ర మంలో కలెక్టర్‌ మాట్లాడారు.

ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలి
మాట్లాడుతన్న కలెక్టర్‌ నివాస్‌

గుజరాతీపేట: ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని కలె క్టర్‌ నివాస్‌ పారిశుధ్య కార్మి కులకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వ హించిన అవగాహన కార్యక్ర మంలో కలెక్టర్‌ మాట్లాడారు.  రహదారులు, వీధుల్లో చెత్తలే కుండా చేయాలన్నారు. మన ఊరు, మనవాడ, మనవీధులను  పరిశుభ్రంగా ఉంచా లని దిశానిర్దేశం చేశారు.   పారిశుధ్య సిబ్బందిపై కమిషనర్‌ నల్లనయ్య రచించిన పాటను వారికి  అంకితం చేశారు.  జేసీ  కె.శ్రీనివాసులు, విశాఖపట్నం రీజనల్‌ డైరెక్టర్‌ కె.రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST