భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T05:57:59+05:30 IST

భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలి

భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకోవాలి
మొయినాబాద్‌ రూరల్‌: జ్ఞాపికలను అందజేస్తున్న అందజేస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల డీన్‌ రామారావు, ఉపాధ్యాయబృందం

  • ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి 


మొయినాబాద్‌ రూరల్‌, జూన్‌ 29: విద్యార్థులు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని ఎన్టీఆర్‌ విద్యసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. మంగళవారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో మండలంలోని హిమయత్‌నగర్‌ గ్రామంలోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించడం పట్ల ఆమె బుధవారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో రాష్ట్రస్థాయిలోనే మొదటిస్థానంలో నిలిచిన నిత్యగౌడ్‌ను, వివిధ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విద్యాసంస్థల సీఈవో రాజేంద్రప్రసాద్‌, కళాశాల డీన్‌ ఎంవీ. రామారావు, డైరెక్టర్‌ ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ ఎస్‌జే.రెడ్డి, ఏఓ సురే్‌షలు విద్యార్థులకు పాఠశాలలో జ్ఞాపికలను అందజేశారు. 

స్టేట్‌ టాప్‌టెన్‌లో ‘ఎన్టీఆర్‌’ విద్యార్థులు

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయిలో టాప్‌టెన్‌ ర్యాంకుల్లో నిలిచారు. ఎంపీసీ ఫస్టియర్‌లో నిత్యగౌడ్‌ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. ఎంపీసీలో 92మంది విద్యార్థులకు గానూ 24 మంది, బైపీసీలో 38మందికి గానూ 8మంది, ఎంఈసీలో ఏడుగురు, సీఈసీలో ఆరుగురు విద్యార్థులు టాప్‌టెన్‌లో నిలిచారు.

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం 

శంషాబాద్‌ రూరల్‌/శంషాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శంషాబాద్‌లో సత్కరించారు. స్థానిక గౌతమి కళాశాలకు చెందిన ఎల్లెపల్లి వైష్ణవి ఎంపీసీలో 460/470, ఎంపీసీలో కొత్తరు అశ్వీని 460/470 మార్కులు సాధించారు. వీరు గతంలో తొండుపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో పూర్తి చేసి, గౌతమి కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్‌ పారేపల్లి లావణ్యశ్రీనివా్‌సగౌడ్‌, పెరిగిపాటి రాణి విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా తొండుపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించగా హెచ్‌ఎం ఎన్‌.యాదయ్యకు స్థానిక నేతలు అభినందనలు తెలిపారు. అదేవిధంగా శంషాబాద్‌ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతున్న రాణికుమారి 466/470మార్కులు సాధించి స్టేట్‌ ర్యాంకు సాధించింది. బైపీసీ ఫస్టియర్‌లో పి.సాయికీర్తన మొత్తం 436/440మార్కులు, ఎంఈసీ ఫస్టియర్‌ విద్యార్థి ఎన్‌.ప్రణీతగుప్త 486/500, సీఈసీ ఫస్టియర్‌లో కే.గౌతమి 489/500మార్కులు సాధించి స్టేట్‌ టాపర్లుగా నిలిచారు. వీరిని కళాశాల చైర్మన్‌ జి.శ్యాంసుందర్‌రెడ్డి అభినందించారు.

కందుకూరు విద్యార్థిని స్టేట్‌ఫస్ట్‌ ..

కందుకూరు: కందుకూరు గ్రామానికి చెందిన సురసాని హర్షిక బైపీసీ ఫస్టియర్‌లో 437/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. విద్యార్థి తల్లిదండ్రులు ఎస్‌ శేఖర్‌రెడ్డి, జ్యోతి వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివిస్తున్నారు. హర్షిక స్టేట్‌ఫస్ట్‌ రావడంతో వారి ఆనందంగానికి అవధులు లేకుండాపోయాయి. 

ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన షాద్‌నగర్‌ విద్యార్థులు 

షాద్‌నగర్‌/కేశంపేట/కొందుర్గు: ఇంటర్‌ ఫలితాల్లో షాద్‌నగర్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు.  విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన నస్ర్తీన్‌ సెకండియర్‌లో 985/1000 మార్కులు సాధించి షాద్‌నగర్‌ టౌన్‌ టాపర్‌గా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ విశ్వనాథ్‌ తెలిపారు. అదేవిధంగా కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకులకు చెందిన విద్యార్థి కళ్యాణి మంగళవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటింది. బైపీసీలో రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంకు సాధించింది. గ్రామానికి చెందిన సత్తయ్యగౌడ్‌, రాములమ్మ దంపతుల కూతురు కళ్యాణి బైపీసీలో 437/440 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. కళ్యాణి మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. సర్పంచ్‌ సావిత్రి బాల్‌రాజ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్‌లు ఆమెను అభినందించారు. అదేవిధంగా కొందుర్గుకు చెందిన సత్యనారాయణ కూతురు ఈరమొల్ల అఖిల బైపీసీ సెకండియర్‌లో 979/1000 మార్కులు సాధించగా సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కుమారుడు రామకృష్ణలు శాలువాతో సత్కరించారు. అఖిల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసుకుంది. పాత్రికేయులు బాలయ్య, కృష్ణయ్య, వహిద్‌, మల్లేష్‌, అక్స్‌ఫర్డు పాఠశాల కరస్పాండెంట్‌ జోసఫ్‌, రామకృష్ణ ఆమెను అభినందించారు.

Updated Date - 2022-06-30T05:57:59+05:30 IST