నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-07-26T05:17:16+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈ నెల 26వ తేదీ(నేడు) జిల్లాలోనే మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యాధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
కరోనా వ్యాక్సిన్‌

లక్షమందికి కరోనా టీకాలు వేయడమే లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు

అందుబాటులో 1.05 లక్షల డోసులు


నెల్లూరు(వైద్యం) జూలై 25 : జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈ నెల 26వ తేదీ(నేడు)  జిల్లాలోనే మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో లక్షమందికి కరోనా వ్యాక్సిన్‌ వేయాలని అధికారులు కార్యాచరణ రూపొందించారు. దీనికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 92 వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించారు. జిల్లాలోని  పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతోపాటు కావలి, గూడూరు ఏరియా ఆసుత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ వేస్తారు. 45 ఏళ్ల పైబడిన వారికి, ఇదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు, గర్భిణీలకు,, కొత్తగా మానసిక వ్యాధిగ్రస్థులకు (వయసుతో నిమిత్తం లేకుండా), వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి, ఉపాధ్యాయులకు, ట్రాన్స్‌జెండర్‌లకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. గత మేలో మొదటి మెగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వవించగా, 45 వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. అలాగే గత జూన్‌ 20వ తేదీన రెండవ సారి మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టగా 75 వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. సోమవారం జరిగే మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేసేలా అందుబా టులో వైద్యశాఖ 1.05 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోస్‌లను అందుబాటులో ఉంచారు. ఇందులో కోవిషీల్డ్‌ లక్ష డోసులు కాగా, కోవాగ్జిన్‌ 5వేల డోసులు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని వ్యాక్సిన్‌ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను ఆదివారం సాయంత్రానికి తరలించారు. వైద్యాధికారుల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్‌  జరుగుతుంది.


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

జిల్లా వ్యాప్తంగా సోమవారం  మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టాం, అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం.

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి 


 

Updated Date - 2021-07-26T05:17:16+05:30 IST