Mumbai cruise case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడు...నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంచనామాలో తేలిన నిజం

ABN , First Publish Date - 2021-10-09T14:42:20+05:30 IST

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి....

Mumbai cruise case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడు...నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పంచనామాలో తేలిన నిజం

ముంబై : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చరాస్ (గంజాయి) తాగినట్లు ఎన్సీబీ పంచనామాలో వెలుగుచూసింది. తాను గంజాయి తాగానని ఆర్యన్ ఖాన్ ఒప్పుకున్నాడని ఎన్సీబీ పేర్కొంది. ఆర్యన్ ఖాన్ స్నేహితుడైన అర్బాజ్ మర్చంట్ బూట్లలో 6 గ్రాముల గంజాయిని తీసుకెళుతుండగా తాము స్వాధీనం చేసుకున్నామని ఎన్సీబీ పంచనామాలో రికార్డు చేశారు.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి ఆశిష్ రాజన్ ప్రసాద్ ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 నిబంధన గురించి నిందితులైన ఆర్యన్ ఖాన్,అర్బాజ్ మర్చంట్‌ లకు వివరించారని పంచనామాలో పేర్కొన్నారు.


దర్యాప్తు అధికారి మీ వద్ద డ్రగ్స్ ఉన్నాయా అని అడిగితే తన షూ లోపల చరాస్ దాచానని అర్బాజ్ చెప్పాడని పంచనామాలో పేర్కొన్నారు. అర్బాజ్ మర్చంట్ స్వచ్ఛందంగా తన షూ నుంచి 6 గ్రాముల చరాస్ ను జిప్ లాక్ ఉన్న బ్యాగులో నుంచి తీసి ఇచ్చాడని ఎన్సీబీ అధికారులు పంచనామాలో తెలిపారు. తాను ఆర్యన్ ఖాన్ తో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నానని, దీనికోసమే తాము క్రూయిజ్ షిప్ లోపలకు వచ్చామని అర్బాజ్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు.ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో జైలులో ఉండాల్సి వచ్చింది.


ఈ పంచనామా నివేదికను ఇద్దరు పంచులైన గెజిటెడ్ అధికారుల సమక్షంలో రికార్డు చేశారు. డ్రగ్స్ కేసులో సహ నిందితులు ఇష్మీత్ సింగ్, విక్రాంత్ కొచ్చర్ ల పేర్లను కూడా పంచనామాలో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో క్రూయిజ్ లో తాము మాదకద్రవ్యాలను తీసుకెళ్లినట్లు నిందితులు అంగీకరించారు.


Updated Date - 2021-10-09T14:42:20+05:30 IST