నవాజ్ షరీఫ్‌కు షాకిచ్చిన బ్రిటన్

ABN , First Publish Date - 2021-08-06T23:37:50+05:30 IST

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాకిచ్చింది. వీసా గడువు పొడగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా.. దేశం విచిడి వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వె

నవాజ్ షరీఫ్‌కు షాకిచ్చిన బ్రిటన్

లండన్: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాకిచ్చింది. వీసా గడువు పొడగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా.. దేశం విచిడి వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ (71)పై పాకిస్థాన్‌లో రెండు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో ఆయనకు కోర్టు 2018లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ క్రమంలో ఆయన కొద్ది రోజులు లాహోర్ జైలులో జైలు జీవితం గడిపారు. తర్వాత వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు. దీంతో లాహోర్ కోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది.



బెయిల్ రావడంతో చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వెళ్లిన షరీఫ్.. వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. కాగా.. తాజాగా మరోసారి వీసా గడువు పొడగింపును కోరుతూ ఆయన చేసిన దరఖాస్తును యూకే హోం ఆఫీస్ తిరస్కరించింది. అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.. నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని పేర్కొంది. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లాల్సిందిగా షరీఫ్‌ను ఆదేశించింది. యూకే హోం ఆఫీస్ ఇచ్చిన ఆదేశాలపై షరీఫ్ అధికార ప్రతినిధి స్పందించారు. దీనిపై బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం వెల్లడించారు. 


Updated Date - 2021-08-06T23:37:50+05:30 IST