Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టెల్లా కళాశాలలో ‘నేవీ డే’

స్టెల్లా కళాశాలలో ‘నేవీ డే’ 

రామలింగేశ్వరనగర్‌, డిసెంబరు 4 : మారిస్‌ స్టెల్లా కళాశాలలో నేవీ యూనిట్‌ ఆధ్వర్యంలో ‘నేవీడే’ సందర్భంగా కళాశాల విద్యార్థినులకు డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలు శనివారం నిర్వహించారు. దేశ రక్షణలో నేవీ పాత్ర, పర్యావరణ పరిరక్షణలో యువత అనే అంశంపై పోటీని నిర్వహించారు. కళాశాల నేవీ ఇన్‌చార్జ్‌ స్వప్న, డాక్టర్‌ జోసిఫిన్‌ సంధ్యారాణిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎన్‌సీసీ కేడెట్స్‌ దేశ రక్షణలో నావికాదళ ప్రాధాన్యతపై పోస్టర్‌ను ప్రదర్శించారు. కల్చరల్‌ వీక్‌లో భాగంగా ర ంగోలీ పోటీలను నిర్వహించారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే అంశంపై ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థినులు రంగవల్లికలను తీర్చిదిద్దారు. జి. ఉషాకుమారి, శాంతిశ్రీ ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పద్మావతి, తులసి, శాంతకుమారిలు రంగోలి పోటీలను పర్యవేక్షించారు. 

Advertisement
Advertisement