నవరత్నాల ముసుగులో నవ బాదుళ్లు

ABN , First Publish Date - 2022-05-20T07:13:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ముసుగులో నవ బాదుళ్లు అమలు చేస్తున్నారని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జున్‌ అన్నారు.

నవరత్నాల ముసుగులో నవ బాదుళ్లు
మార్కాపురంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

మార్కాపురం, మే 19: వైసీపీ ప్రభుత్వం నవరత్నాల ముసుగులో నవ బాదుళ్లు అమలు చేస్తున్నారని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జున్‌ అన్నారు. పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో శనివారం బాదుడే.. బాదుడు కార్యక్రమం నిర్వమించారు. ఈ సందర్భంగా వక్కలగడ్డ మల్లికార్జున్‌ మాట్లాడుతూ ఇసుక, మద్యం, పెట్రోలు, డీజిల్‌, చెత్త పన్ను, ఇంటి పన్ను, సిమెంట్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుదల, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీల పెంపు వంటి వాటితో వైసీపీ నిజస్వరూపం బయటపడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలీ, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు యేరువ వెంకట నారాయణరెడ్డి, తెలుగుయువత నాయకులు దొడ్డా రవికుమార్‌, టీడీపీ నాయకులు మస్తానయ్య, పఠాన్‌ గులాబ్‌, శ్రీనివాసరెడ్డి, ఖాసీం, ఆవుల శ్రీను, గంగయ్య, బొంతల హరి తదితరులు పాల్గొన్నారు. 

తర్లుపాడు : రైతుల వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించటం దారుణమని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు కంచెర్ల కాశయ్య అన్నారు. మండ లంలోని రోలుగుంపాడులో ‘బాదుడే బాదుడు’ కార్య క్రమం, ర్యాలీని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను ధరలతో బాదేస్తున్నారన్నారు. ప్రస్తుతం నిత్యవసర వస్తువులు పెట్రోల్‌, గ్యాస్‌ వంటి ధరలను పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు.  పాదయాత్రలో హామీల వర్షం కురిపించాడన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక హామీలు నేరవేర్చకపోగా అడిగినవారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు యు.చిన్నపురెడ్డి, మాజీ ఎంపీపీ పి.వేసుదాసు,  ఎంపీటీసీ మాజీ సభ్యుడు పి.గోపినాథ్‌చౌదరి, సాదం ఈరయ్య, టీడీపీ నేతలు మేకల వెంకట్‌యాదవ్‌,  జి.నరసింహులు, ఏసేపోగు జాను, బాలరాజు, పి.కేశవులు, కె.నారాయణరెడ్డి, దాసు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T07:13:52+05:30 IST