జీవాలకు నట్టల నివారణ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-11-29T04:13:56+05:30 IST

డిసెంబర్‌ 1నుంచి 7వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్థక అధికారి డా.బి.మధు సూదన్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

జీవాలకు నట్టల నివారణ కార్యక్రమం

పాలమూరు, నవంబరు 28 : డిసెంబర్‌ 1నుంచి 7వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు సంవర్థక అధికారి డా.బి.మధు సూదన్‌గౌడ్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఆంధ్రజ్యో తితో మాట్లాడుతూ జిల్లాలోని పశువైద్యసిబ్బందిని 54 బృం దాలుగా ఏర్పాటుచేసి గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు తాగిస్తారని వివరించారు. ఈ కా ర్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

Updated Date - 2020-11-29T04:13:56+05:30 IST