Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతిపిత పుట్టిన రోజు!

ఈరోజు మహాత్మాగాంధీ పుట్టిన రోజు. ఆయన పూర్తి పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ అని అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకొంటారు.

  1. గాంధీ ఐదుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి కోసం నామినేట్‌ అయ్యారు. కానీ ఆయనను అ అవార్డు వరించలేదు.
  2. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 21 ఏళ్ల తరువాత బ్రిటన్‌ ప్రభుత్వం గాంధీ గౌరవార్థం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
  3. మహాత్మాగాంధీ మెమోరియల్‌ మ్యూజియంను 1959లో తమిళనాడులోని మధురైలో నెలకొల్పారు. ఈ మ్యూజియంలో మహాత్మాగాంధీ హత్యకు గురైనరోజు ధరించిన బట్టలు, వాటికి అంటిన రక్తపు మరకలను చూడొచ్చు. 
  4.  గాంధీ భార్యపేరు కస్తూర్బా. వారికి నలుగురు మగపిల్లలు. వారి పేర్లు హరిలాల్‌, మనిలాల్‌, రాందాస్‌, దేవ్‌దాస్‌. 
Advertisement
Advertisement