సౌదీకి శరణార్థిగా గొటబాయ?

ABN , First Publish Date - 2022-07-15T09:06:48+05:30 IST

సౌదీకి శరణార్థిగా గొటబాయ?

సౌదీకి శరణార్థిగా గొటబాయ?

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

తీవ్ర ప్రజాగ్రహానికి గురయిన శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స.. సౌదీ అరేబియాకు శరణార్థిగా వెళ్లే అవకాశం ఉన్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సౌదీ వాణిజ్య రాజధాని జెద్ధాకు చేరుకుని ఆశ్రయం పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయిగానీ.. ఆ వార్తలను సౌదీ అధికారులు ధ్రువీకరించలేదు. ఖండించలేదు. గతంలోకూడా.. పెద్ద ఎత్తున ప్రజాగ్రహానికి గురైన ఉగాండా నియంత ఈడీ అమీన్‌కు, అరబ్బు జాస్మిన్‌ విప్లవం తర్వాత ట్యునీషియా అధ్యక్షుడు అలీ బెన్‌కు, సైన్యంతో వైరం కారణంగా దేశం వీడిన  పాకిస్థాన్‌ నేత నవాజ్‌ షరీ్‌ఫకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర సౌదీ అరేబియాకు ఉంది. సౌదీలో కాకుంటే.. యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌లో రాజపక్స ఆశ్రయం పొందే అవకాశాలున్నట్లుగా భావిస్తున్నారు. పౌర ప్రభుత్వంతో విబేధాలు వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముష్రా్‌ఫకు, అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా సేనల ఉపసంహరణ అనంతరం అష్రఫ్‌ ఘనీకి ఆశ్రయించిన చరిత్ర యూఏఈకి ఉంది. 

Updated Date - 2022-07-15T09:06:48+05:30 IST