జాతీయ స్థాయి మల్లయుద్ధం పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

ABN , First Publish Date - 2020-02-20T07:18:31+05:30 IST

ఫ్రీ రోమన్‌ స్టైల్‌ విధానంలో రాష్ట్ర స్థాయి మల్లయుద్ధం పోటీలను హైదరాబాద్‌లోని ఎల్‌బీస్టేడియంలో నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి మల్లయుద్ధం

జాతీయ స్థాయి మల్లయుద్ధం పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 19: ఫ్రీ రోమన్‌ స్టైల్‌ విధానంలో రాష్ట్ర స్థాయి మల్లయుద్ధం పోటీలను హైదరాబాద్‌లోని ఎల్‌బీస్టేడియంలో నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి మల్లయుద్ధం పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విఠల్‌నాయక్‌, కోచ్‌ జైపాల్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన 97 కిలోల విభాగంలో అక్తాబ్‌, 63 కిలోల విభాగంలో చరణ్‌, 57 కిలోల విభాగంలో రమేశ్‌, 55 కిలోల విభాగంలో మధు పాల్గొనాలన్నారు. ఇందులో చరణ్‌, రమేష్‌, మధులు గోల్డ్‌ మెడల్‌ సాధించగా, అక్తాబ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించారన్నారు. వీరు మార్చి 4న హిమాచల్‌ ప్రదేశ్‌లో జాతీయస్థాయి మల్లయుద్ధం పోటీల్లో పాల్గొంటారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు మల్లయోధులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

Updated Date - 2020-02-20T07:18:31+05:30 IST