హోరా హోరీగా కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2022-01-17T05:40:01+05:30 IST

పట్టణంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి.

హోరా హోరీగా కబడ్డీ పోటీలు
మహిళల విభాగంలో తలపడుతున్న బిహార్‌– హర్యానా

నరసాపురం, జనవరి 16: పట్టణంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మహిళల విభాగంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఆంధ్ర, మహారాష్ట్ర జట్లు దూసుకుపోతున్నాయి. పురుషుల విభాగంలో అర్మీ హైదరాబాద్‌, ఆంధ్ర, హర్యాన జట్లు ముందంజలో ఉన్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పురుషుల విభాగంలో  అర్మీ హైదరాబాద్‌ – పశ్చిమ బెంగాల్‌ జట్టుపై 27, నార్త్‌ అండ్‌ రైల్వేపై హర్యానా రెండు పాయింటు, అర్మీ అహ్మదబాద్‌ –తమిళనాడుపై రెండు పాయింట్లు, హర్యానపై మహారాష్ట్ర ఒక్క పాయింట్‌, తమిళనాడుపై ఆర్మీ హైదరాబాద్‌ 23, వెస్ట్‌ బెంగాల్‌పై అర్‌ఎస్‌ సోర్ట్స్‌ క్లబ్‌ 9 పాయింట్లు, అంద్రా– ఢిల్లీ క్లబ్‌పై 16 పాయింట్లు, – యూపీ– ఎస్‌ఎస్‌బిపై హర్యాన రెండు పాయింట్లు, హర్యాన– మహారాష్ట్రక్లబ్‌పై జరిగిన మ్యాచ్‌ టైగా మారింది. ఈ రెండు టీమ్‌లు 41 పాయింట్లు సాధించాయి. స్ర్తీ విభాగంలో అర్‌ఎస్‌ఎస్‌బి క్లబ్‌పై ఎస్‌ఎస్‌బి 10 పాయింట్ల తేడాతో గెలిచింది. వెస్ట్‌ బెంగాల్‌పై కర్ణాటక 21 విజయం సాధించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 28 జట్లు తలపడుతున్నాయి. ఇందులో పురుషుల విభాగంలో 14, మహిళా విభాగంలో 14 రాష్ర్టాల జట్లు ఉన్నాయి. సోమవారం రాత్రికి సెమీ ఫైనల్స్‌కు చేరనున్నాయి. మంగళవారం పైనల్స్‌ జరగనున్నాయి.



Updated Date - 2022-01-17T05:40:01+05:30 IST