Abn logo
Jan 25 2021 @ 00:59AM

2నుంచి ఖానాపూర్‌లో జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు

ఖానాపూర్‌, జనవరి 24: ఫిబ్రవరి 2వ తేది నుంచి  ఖానాపూర్‌లో జాతీయ స్థాయి టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నయీమ్‌ఖా న్‌, ఇర్ఫాన్‌డానిష్‌, నసీర్‌హైమద్‌, ఎస్‌డీ.ఫయిమ్‌లు తె లిపారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖానాపూర్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ పేరిట నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో పలు రాష్ర్టాల నుంచి క్రికెట్‌ జట్లు పాల్గొంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు పిబ్రవరి 1వ తేదీ వరకు తమ పూర్తి వివరాలను నమోదు చేయించుకోవాలని తెలిపా రు. ఎంట్రీ ఫీజు రూ.3600 చెల్లించాల్సి ఉంటుందని, టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు నగదు బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సీరిస్‌ బహుమతులను సైతం అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నిర్వాహకులు నయీమ్‌ఖాన్‌ 9573031991, ఇర్ఫాన్‌ డానిష్‌ 9676852218, నసీర్‌హైమద్‌ సెల్‌ నెం. 9494153 518 ద్వారా సంప్రదించాలని వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement